బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ రాముడిగా, హీరోయిన్ సాయి పల్లవి సీతగా బాలీవుడ్ దర్శకుడు నితేష్ తివారీ ‘రామాయణ’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. విలక్షణ నటుడు యశ్.. రావణుడిగా కనిపించనున్నారు. ఆయన సతీమణి మండోదరి పాత్రలో కాజల్ నటించనుంది. ఐతే, మరో కీలక పాత్ర శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్ కనిపించబోతుంది.
కాగా (శూర్పణఖ) రకుల్ – మండోదరి (కాజల్) పాత్రల మధ్య ఓ ఇంట్రెస్టింగ్ సన్నివేశం ఉంటుందని.. ఇప్పటివరకు రామాయణం పై వచ్చిన ఏ సినిమాలోనూ ఇలాంటి సన్నివేశం లేదు అని.. అలాంటి సన్నివేశం ‘రామాయణ’లో ఉండబోతుందని తెలుస్తోంది. ఇక సినీప్రియులందరి దృష్టి ప్రస్తుతం ‘రామాయణ’ మీదే ఉంది. బాలీవుడ్‌లో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమా కోసం హాలీవుడ్ ప్రమాణాలకు తగ్గకుండా విదేశీ నిపుణులు పని చేస్తున్నారు.
పైగా సరికొత్త టెక్నాలజీ, భారీ సెట్స్‌తో ఇండియా మరియు విదేశాల్లో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. ఇక ఈ సినిమాలో సన్నీ డియోల్ హనుమంతుడిగా, రవి దూబే లక్ష్మణుడిగా నటిస్తున్నారు.


