‘బాలయ్య’ సినిమాలో హీరోయిన్ ఫిక్స్ ?

‘బాలయ్య’ సినిమాలో హీరోయిన్ ఫిక్స్ ?

Published on Sep 7, 2026 7:00 AM IST

Nandamuri-Balakrishna

కొరటాల శివ దర్శకత్వంలో బాలయ్య బాబు హీరోగా ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టుకు సంబంధించి బాలయ్య సరికొత్త మేకోవర్‌లో కనిపించబోతున్నాడు. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ వచ్చే నెల మొదటి వారం నుంచి స్టార్ట్ చేయనున్నారు. ముందుగా తీయనున్న యాక్షన్ సీన్స్ కోసం ఓ భారీ సెట్ వేస్తున్నారట. ఇక ఈ సినిమాలో నటించే హీరోయిన్ గురించి ఇప్పటికే చాలా రూమర్స్ వచ్చాయి. ఐతే, తాజాగా వినిపిస్తున్న అప్ డేట్ ప్రకారం.. ఐశ్వర్య లక్ష్మీను హీరోయిన్‌ గా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.

అన్నట్టు ఈ సినిమా మొదటి షెడ్యూల్ లో బాలయ్య లేని సన్నివేశాలను తీయబోతున్నారని తెలుస్తోంది. కేవలం ఈ షెడ్యూల్ కోసమే సుమారు 15 రోజులకు పైగా షూటింగ్ సాగనుంది. అన్నట్టు ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రధానంగా ఉంటాయని తెలుస్తోంది. స్టోరీ కూడా ప్రత్యేకంగా ఉంటుందట. దేవర తర్వాత కొరటాల శివ చేస్తున్న సినిమా కావడంతో.. కథ పై కొరటాల బాగా కసరత్తులు చేశారట. కాగా సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు