క్రేజీ హీరోయిన్ కి క్రేజీ ఆఫర్ ?

Published on Jun 17, 2021 12:50 pm IST

క్రేజీ హీరోయిన్ సాయి పల్లవికి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే ఆమెకు వరుస అవకాశాలు వస్తున్నాయి. తాజాగా సాయి పల్లవికి ఓ హిందీ సినిమాలో ఛాన్స్ వచ్చిందని తెలుస్తోంది. మరి ఈ టాలెంటెడ్ హీరోయిన్ పై వస్తోన్న ఈ క్రేజీ ఆఫర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఇక మొదటి నుండి సాయిపల్లవి చాలా సెలెక్టెడ్‌ గా సినిమాలు చేస్తూ వస్తోంది.

సాయి పల్లవి బాలీవుడ్ సినిమాకి ఒకే చెప్పిందని తెలుస్తోంది. మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందనేది క్లారిటీ లేదు. సాయి పల్లవి స్వయంగా వెల్లడించే వరకు ఈ వార్తను అధికారికంగా ద్రువీకరించలేం. ఇక ప్రస్తుతం సాయి పల్లవి నటించిన ‘లవ్ స్టోరి’, ‘విరాట పర్వం’ సినిమాలకు విడుదలకు రెడీగా ఉన్నారు. నానితో నటిస్తున్న ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.

సంబంధిత సమాచారం :