మహేష్ -వంశీ పైడిపల్లి సినిమా ఆగిపోయిందా?

Published on Feb 22, 2020 1:48 pm IST

సరిలేరు నీకెవ్వరు మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మహేష్ తన తదుపరి చిత్రం దర్శకుడు వంశీ పైడిపల్లితో చేస్తున్నారు. ఇప్పటికే దీనిపై మహేష్ మరియు దర్శకుడు వంశీ పైడిపల్లి స్పష్టత ఇవ్వడం జరిగింది. మాఫియా నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో మహేష్ మాఫియా డాన్ గా కనిపిస్తారని ఓ ప్రచారం కూడా జరిగింది. కాగా తాజా సమాచారం ప్రకారం మహేష్ ఈ ప్రాజెక్ట్ హోల్డ్ లో పెట్టారట. ఆయన వంశీ పైడిపల్లితో కాకుండా వేరే దర్శకుడితో చేసే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

వంశీ పైడిపల్లి స్క్రిప్ట్ తో పూర్తి స్థాయిలో సంతృప్తి చెందని మహేష్ కొన్ని మార్పులు చేర్పులు చెప్పారని తెలుస్తుంది. దీనితో మహేష్ చెప్పిన ప్రకారం స్క్రిప్ట్ సిద్ధం చేయడానికి కొంత సమయం పట్టేలా కనిపిస్తుంది. దీనితో మహేష్- వంశీ మూవీ అనుకున్న సమయానికి మొదలయ్యే సూచనలు కనిపించడం లేదు. నిజానికి ఈ చిత్రం మే నుండి సెట్స్ పైకి వెళ్లాల్సివుంది. ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ పరిశ్రమలో ప్రముఖంగా వినిపిస్తుంది.

సంబంధిత సమాచారం :

X
More