‘హరీష్ – పవన్’ సినిమా పై క్రేజీ రూమర్ !

Published on Apr 5, 2021 3:00 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమాలో పవన్ ప్లాష్ బ్యాక్ లో ఐబీ ఆఫీసర్ గా నటించబోతున్నాడని.. అలాగే ప్లాష్ బ్యాక్ లో వచ్చే తండ్రి పాత్రలోనూ.. అలాగే లైవ్ లో వచ్చే కొడుకు పాత్రలోనూ పవన్ ఈ సినిమాలో రెండు పాత్రల్లో కనిపిస్తాడని.. ఇక తండ్రి పాత్రది ఐబీ ఆఫీసర్ పాత్ర అని ఇలా ఒక రూమర్ ఒకటి బాగా హల్ చల్ చేస్తోంది.

అయితే ఈ రూమర్ లో ఎలాంటి వాస్తవం లేదని తెలుస్తోంది. ఈ సినిమాలో పవన్ డ్యూయెల్ రోల్ చేయడం లేదట. అలాగే పవన్ కోసం ఫుల్ యాక్షన్ అండ్ మాస్ మసాలా స్క్రిప్ట్ రాశాడని.. కేవలం పవన్ ఫ్యాన్స్ ను దృష్టిలో పెట్టుకునే హరీష్ స్క్రిప్ట్ రాశాడని తెలుస్తోంది. ఇక గతంలో హరీష్, పవన్ కాంబినేషన్లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ పవన్ కెరీర్ లోనే ప్రత్యేకంగా నిలిచిపోయింది. అప్పటికే వరుస ప్లాప్స్ లో ఉన్న పవన్.. గబ్బర్ సింగ్ తో ఇండస్ట్రీ రికార్డ్స్ క్రియేట్ చేశాడు. అందుకే వీరి సినిమా పై అభిమానుల్లోనే కాదు ప్రేక్షకులందరిలో మంచి ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం :