2020 గాను మోస్ట్ క్రేజీ మూవీ ఆర్ ఆర్ ఆర్ అనడంలో సందేహం లేదు. రాజమౌళి ఇద్దరు టాలీవుడ్ టాప్ స్టార్స్ తో చేస్తున్న ఈ పీరియాడిక్ మల్టీ స్టారర్ పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. ఇటీవలే ఎన్టీఆర్ పై విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించడం జరిగింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ ఉద్యమకారుడు కొమరం భీమ్ రోల్ చేస్తున్న నేపథ్యంలో ఎన్టీఆర్ లుక్ పై రెండు రోజులుగా ఆసక్తికర పుకారు ఒకటి నడుస్తుంది. అదేమిటంటే ఆర్ ఆర్ ఆర్ లో ఎన్టీఆర్ గుండుతో కనిపిస్తారట. వినడానికి క్రేజీగా ఉన్నప్పటికీ చరిత్ర రీత్యా కొమరం భీమ్ తలపాగా ధరించి ఉన్నారు. ఇటీవల లీకైన లుక్ లో కూడా ఎన్టీఆర్ తలపాగా తో కనిపించారు.
కాబట్టి ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ సినిమాలో గుండుతో కనిపిస్తారు అనే పుకారు నమ్మొచ్చా.. అనిపిస్తుంది. ఐతే రాజమౌళి చారిత్రక పాత్రలకు కల్పితం జోడించి ఈ మూవీ చేస్తున్నామని చెప్పిన తరుణంలో ఈ వాదనలను కొట్టిపారేయలేం. జులై 30న ఈ అనుమానాలకు సమాధానం దొరుకుతుంది. ఇక రామ్ చరణ్ ఈ చిత్రంలో అల్లూరి రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే.


