ఇప్పటికీ ఓటిటిని షేక్ చేస్తున్న ప్రభాస్ కం బ్యాక్..!

ఇప్పటికీ ఓటిటిని షేక్ చేస్తున్న ప్రభాస్ కం బ్యాక్..!

Published on May 28, 2024 2:00 PM IST

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా శృతి హాసన్ హీరోయిన్ (Sruthi Haasan) గా సెన్సేషనల్ మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా “సలార్” కోసం తెలిసిందే. మరి ఈ సినిమాతో ప్రభాస్ మాసివ్ కం బ్యాక్ ని అందుకోగా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు కొల్లగొట్టి అదరగొట్టింది.

ఇక ఈ తర్వాత ఓటిటి ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చిన ఈ సినిమా అక్కడా అదరగొట్టింది. అయితే ఈ చిత్రం హిందీ వెర్షన్ వరకు మాత్రం మరో స్ట్రీమింగ్ యాప్ డిస్నీ+ హాట్ స్టార్ లో రిలీజ్ అయ్యింది. అయితే ఈ సినిమా అందులో వచ్చి కూడా చాలా రోజులు అయిపోయింది. కానీ ఆసక్తికరంగా ఈ సినిమా ఇప్పటికీ హాట్ స్టార్ ట్రెండింగ్ ఛార్ట్స్ లో టాప్ 2 లో ట్రెండ్ అవుతూ నిలిచిందట.

వరుసగా 15 వారాలు పాటుగా టాప్ 10 ట్రెండ్ లో కొనసాగుతూనే ఉందట ఈ సినిమా. దీనితో ఈ సినిమా ఓటిటిలో ఏ రేంజ్ ప్రకంపనలు సెట్ చేస్తుందో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ భారీ సినిమాకి సీక్వెల్ ని కూడా మేకర్స్ కన్ఫర్మ్ చేయగా ఈ సినిమా పనుల్లో ఇపుడు వారు బిజీగా ఉన్నారు. మరి రవి బసృర్ సంగీతం అందించగా హోంబళే ఫిల్మ్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు