మెగాస్టార్ ‘ఫాంటసీ డ్రామా’లో క్రేజీ సీక్వెన్స్

మెగాస్టార్ ‘ఫాంటసీ డ్రామా’లో క్రేజీ సీక్వెన్స్

Published on Dec 12, 2023 12:40 AM IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా యంగ్ దర్శకుడు వశిష్ట ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఈ సినిమాకి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ గాసిప్ వినిపిస్తోంది. ఈ సినిమాలో వచ్చే ఫ్లాష్ బ్యాక్ మొత్తం అద్భుతమైన ఫాంటసీ డ్రామాగా సాగనుంది. ఐతే, ఈ ఫాంటసీ ఫ్లాష్ బ్యాక్ లోని వీఎఫ్ఎక్స్ విజువల్స్ సినిమా మొత్తంలోనే హైలైట్ అట. ముఖ్యంగా హిమాలయాల నేపథ్యంలో వచ్చే ఓ యాక్షన్ సీక్వెన్స్ లోని విజువల్స్ కూడా అద్భుతంగా అనిపిస్తాయట. మెగాస్టార్ చిరంజీవి పాత్ర కూడా చాలా సర్ ప్రైజింగ్ ఎలిమెంట్స్ తో ఉంటుందని తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిష ను ఫైనల్ చేశారని తెలుస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి దర్శకుడు వశిష్ట పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఈ సినిమాలో మెగాస్టార్ ను ఎలా చూడాలి అనుకుంటున్నారో.. ఆయన పాత్ర అలాగే ఉంటుంది అని, దానితో పాటుగా అద్భుతమైన ఫాంటసీ డ్రామా కూడా ఉంటుంది అని వశిష్ట చెప్పుకొచ్చాడు. ఇక ఈ భారీ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తుండగా యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాకి ‘విశ్వంభర’ అనే టైటిల్ ని మేకర్స్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు