“వార్ 2” లో క్రేజీ షర్ట్ లెస్ సీక్వెన్స్!

“వార్ 2” లో క్రేజీ షర్ట్ లెస్ సీక్వెన్స్!

Published on May 19, 2024 3:00 AM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) వార్ 2 చిత్రంతో బాలీవుడ్ లోకి అడుగు పెడుతున్నారు. ఈ చిత్రం లో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ లు నటిస్తున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ స్పై యాక్షన్ ఎంటర్టైనర్ వచ్చే ఏడాది థియేటర్ల లో రిలీజ్ కానుంది. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ చిత్రం లో ఎన్టీఆర్ డాన్స్ తో పాటుగా, యాక్షన్ సీక్వెన్స్ లలో కూడా తన సత్తా చాటనున్నాడు. ఈ చిత్రం లో క్రేజీ షర్ట్ లెస్ సీక్వెన్స్ ను మేకర్స్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. హృతిక్ రోషన్ మరియు ఎన్టీఆర్ లో తమ సిక్స్ ప్యాక్ బాడీ లతో ఫ్యాన్స్ ను అలరించనున్నారు. దీనిపై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రీతం సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు