మహేష్ టైటిల్ వెనుక అసలు కథ అదా?

Published on May 28, 2020 3:28 pm IST

నిన్నిటి నుండి టాలీవుడ్ సర్కిల్స్ లో ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతుంది. అదేమిటంటే మహేష్ 27వ చిత్ర టైటిల్. దర్శకుడు పరుశురాం తో మహేష్ తన నెక్స్ట్ మూవీ చేస్తుండగా ఈ మూవీ టైటిల్ ‘సర్కారు వారి పాట’ అనే భిన్న టైటిల్ పెట్టనున్నారని వార్తలు వస్తున్నాయి. కథ రీత్యా ఈ టైటిల్ చక్కగా సరిపోతుందని పరుశురామ్ బావిస్తున్నాడట. ఇక ఈ మూవీ నేపథ్యం ఆర్థిక నేరాల ఆధారంగా తెరకెక్కనుందని సమాచారం.

కొన్నేళ్లుగా ఇండియాలో నీరవ్ మోడీ, విజయ్ మాల్యా వంటి వారు బ్యాంక్స్ కి వేల కోట్లు టోకరా పెట్టి విదేశాలకు చెక్కేశారు. మరి ఇలాంటి ఆర్థిక నేరగాళ్ల పని పట్టే హీరోగా మహేష్ కనిపిస్తాడని వినికిడి. అందుకే కథకు సెట్ అయ్యేలా సర్కారు వారి పాట అనే టైటిల్ నిర్ణయించారట. మరి ఈ ఉహాగానాలలో నిజం ఎంతో కానీ సబ్జెక్టు మాత్రం చాలా ట్రెండీ గా ఉంది. ఇక కృష్ణ గారి పుట్టిన రోజు మరో మూడు రోజులలో ఉండనుంది, ఆ రోజు మహేష్ కొత్త మూవీ ప్రకటన ఉంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More