క్రేజీ టాక్ : ‘సలార్’ ముందు భారీ సవాలే ఉందంటున్నారు

క్రేజీ టాక్ : ‘సలార్’ ముందు భారీ సవాలే ఉందంటున్నారు

Published on Dec 10, 2023 3:02 AM IST


పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా కెజిఎఫ్ సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ భారీ మాస్ యాక్షన్ మూవీ సలార్. ఈ మూవీలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా హోంబలె ఫిలిమ్స్ సంస్థ దీనిని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్ తో అందరినీ ఆకట్టుకుని భారీ అంచనాలు ఏర్పరిచిన సలార్ పార్ట్ 1 సీస్ ఫైర్ మూవీ డిసెంబర్ 22న ఆడియన్స్ ముందుకి రానుంది.

మ్యాటర్ ఏమిటంటే, ఇప్పటికే సలార్ పై ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా తారా స్థాయిలో అంచనాలు ఉండడంతో పాటు మూవీకి దాదాపుగా అన్ని ఏరియాల్లో ఎంతో భారీ ఎత్తున బిజినెస్ కూడా జరిగింది. రిలీజ్ అనంతరం సలార్ మూవీ బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంటే కనుక చాలా ఏరియాల్లో పెద్ద రికార్థులు నెలకొల్పుతుందని తెలుస్తోంది. కంటెంట్ కరెక్ట్ గా ఆడియన్స్ కి కనెక్ట్ అయితే అది పెద్ద కష్టమేమీ కాదని, అయితే ఒకకరంగా ఇది సలార్ మూవీకి పెద్ద సవాలే అని పలువురు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు బాహుబలి 2 తరువాత కెరీర్ పరంగా తమ హీరోకి బ్లాక్ బస్టర్ సక్సెస్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. మరి అందరి అంచనాలు అందుకుని రిలీజ్ అనంతరం సలార్ ఏ స్థాయి సక్సెస్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు