క్రేజీ టాక్ : ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ కి రెడీ అవుతోన్న ఎన్టీఆర్ ‘దేవర’ ?

క్రేజీ టాక్ : ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ కి రెడీ అవుతోన్న ఎన్టీఆర్ ‘దేవర’ ?

Published on Dec 6, 2023 3:00 AM IST


టాలీవుడ్ స్టార్ పాన్ ఇండియన్ యాక్టర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ థ్రిల్లింగ్ మూవీ దేవర. ఈ మూవీ ద్వారా బాలీవుడ్ నటి జాన్వికపూర్ తెలుగులోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుండగా బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీ ఖాన్ ఇందులో విలన్ గా నటిస్తున్నారు. అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్న దేవర మూవీని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ సంస్థలు గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీకి సంబంధించి తాజాగా ఒక క్రేజీ న్యూస్ టాలీవుడ్ లో బజ్ గా వైరల్ అవుతోంది. దాని ప్రకారం దేవర ఫస్ట్ లుక్ టీజర్ ని రానున్న క్రిస్మస్ పండుగ కానుకగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. అలానే దీనికి సంబంధించి వారి నుండి త్వరలో అనౌన్స్ మెంట్ కూడా వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఈ పాన్ ఇండియన్ మూవీని 2024 ఏప్రిల్ 5న విడుదల చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు