క్రేజీ టాక్.. “కల్కి” సస్పెన్స్ కి తెర పడనుంది.!

క్రేజీ టాక్.. “కల్కి” సస్పెన్స్ కి తెర పడనుంది.!

Published on Mar 27, 2024 8:00 AM IST

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా ఇప్పుడు చేస్తున్న పలు భారీ చిత్రాల్లో దర్శకుడు నాగ్ అశ్విన్ తో చేస్తున్న పాన్ వరల్డ్ లెవెల్ చిత్రం “కల్కి 2898ఎడి” (Kalki 2898AD) కూడా ఒకటి. మరి ఈ చిత్రం రిలీజ్ పట్ల ఇప్పుడు పరిస్థితి ఆసక్తిగా మారింది. మేకర్స్ మొదటగా ఈ మే 9నే రిలీజ్ డేట్ ని లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే.

చాలా స్పెషల్ గా ఈ డేట్ (Kalki Release Date) ని ప్లాన్ చేసుకోగా ఈ సమయానికి ఊహించని విధంగా ఎన్నికల షెడ్యూల్ రావడంతో అంతా ఒక్కసారిగా మారింది. అయితే ఇప్పటికీ కల్కి వాయిదా పడినట్టుగా అధికారికంగా ఇంకా వెల్లడి చేయలేదు. దీనితో ఈ సినిమా డేట్ మరింత సస్పెన్స్ గా మారగా దీనికి అతి త్వరలోనే తెరపడనుంది అని క్రేజీ టాక్ ఇపుడు వినిపిస్తుంది.

జస్ట్ ఈ రానున్న రెండు మూడు రోజుల్లోనే కల్కి రిలీజ్ డేట్ పై ఓ క్లారిటీ రానుంది అని దాదాపు కొత్త డేట్ ని మేకర్స్ అనౌన్స్ చేయనున్నట్టుగా పలు రూమర్స్ ఇప్పుడు వినిపిస్తున్నాయి. మరి దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రంలో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకోణ్ సహా దిశా పటాని లాంటి అగ్ర తారలు నటిస్తుండగా సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే దిగ్గజ నిర్మాత అశ్వనీదత్ భారీ వ్యయంతో ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు