క్రేజీ టాక్ : సన్నీ డియోల్ ‘గదర్ – 3’ కన్ఫర్మ్ ?

క్రేజీ టాక్ : సన్నీ డియోల్ ‘గదర్ – 3’ కన్ఫర్మ్ ?

Published on Jan 20, 2024 2:03 AM IST

సన్నీ డియోల్ హీరోగా బాలీవుడ్ లో తెరకెక్కిన హిందీ మూవీ గదర్ ఏక్ ప్రేమ్ కథ 2001లో రిలీజ్ అయి పెద్ద సక్సెస్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అనిల్ శర్మ దర్శకత్వం వహించిన ఈ మూవీ యొక్క సీక్వెల్ అయిన గదర్ 2 ఇటీవల బాక్సాఫీస్ వద్ద రూ. 500 కోట్ల నెట్ కలెక్షన్ అందుకుని బిగ్గెస్ట్ సక్సెస్ సొంతం చేసుకుంది.

ఇక లేటెస్ట్ న్యూస్ ఏంటంటే దీనికి సీక్వెల్ గా గదర్ 3 ని కూడా మేకర్స్ గ్రాండ్ గా తెరకెక్కించనున్నట్లు లేటెస్ట్ న్యూస్. ఈ మూవీ జనవరి 2025 లో పట్టాలెక్కనుందట. కాగా ఈ మూవీని కూడా అనిల్ శర్మ నే తెరకెక్కించనున్నారు. ఇక ఈ మూవీ కూడా పాకిస్తాన్, ఇండియా బ్యాక్ డ్రాప్ తో సాగే యాక్షన్ ఎమోషనల్ డ్రామాగా సాగనున్నట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం దర్శకుడు అనిల్, హీరో సన్నీ డియోల్ పలు ప్రాజక్ట్స్ తో బిజీగా ఉండడంతో అవి పూర్తి అయిన అనంతరం గదర్ 3 ప్రారంభం కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు