మెగాస్టార్ చిరంజీవీ సైన్ చేసిన సినిమాల్లో ‘లూసిఫర్’ తెలుగు రీమేక్ కూడ ఒకటి. మోహన్ రాజా ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో చిరు చేస్తున్న ‘ఆచార్య’ సినిమా దాదాపు పూర్తైనట్టే. అందుకే ఏప్రిల్ నుండి ఈ రీమేక్ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. మలయాళంలో మోహన్ లాల్ చేసిన ఈ సినిమా సూపట్ హిట్ అయింది. పుష్కలమైన ఎలివేషన్స్ కలిగిన సబ్జెక్ట్ కావడంతో చిరును పంచెకట్టులో ఫుల్ లెంగ్త్ సినిమాలో చూడబోతున్నామని ఎగ్జైట్ అవుతున్నారు అభిమానులు.
మోహన్ రాజా సైతం తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు కథలో మార్పులు చేర్పులు చేస్తున్నారు. ప్రస్తుతం సినిమాకు ఏం టైటిల్ పెట్టాలి అనే చర్చలు జరుగుతున్నాయట. ‘రారాజు’ అనే టైటిల్ పరిశీలనలో ఉందట. మరి దాన్నే ఫైనల్ చేస్తారో లేకపోతే వేరొక టైటిల్ వెతుకుతారో చూడాలి. సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్ – సూపర్ గుడ్ ఫిలిమ్స్ – ఎన్‌విఆర్ ఫిలిమ్స్ బ్యానర్స్‌పై ఆర్ బి చౌదరి, ఎన్ వి ప్రసాద్ నిర్మించనున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందించనున్నారు.
