కల్కి నుండి అద్దిరిపొయిన లేటెస్ట్ అప్డేట్…ఫ్యాన్స్ కి సూపర్ ట్రీట్ రెడీ!

కల్కి నుండి అద్దిరిపొయిన లేటెస్ట్ అప్డేట్…ఫ్యాన్స్ కి సూపర్ ట్రీట్ రెడీ!

Published on May 27, 2024 8:24 PM IST

రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కల్కి 2898ఏ. డి(Kalki2898AD) చిత్రం జూన్ 27, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ కి రెడీ అయిపోయింది. ఈ చిత్రం చేస్తున్న ప్రమోషన్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. సినిమా పై మంచి హైప్ ను క్రియేట్ చేయడం లో ఈ ప్రమోషన్స్ ను సినిమాకి కీలకంగా మారాయి. తాజాగా చిత్ర బృందం మరో అద్భుతమైన అప్డేట్ ను ఫ్యాన్స్ కి అందించింది.

యానిమేషన్ ప్రిల్యూడ్ బుజ్జి x భైరవ మే 31, 2024న అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రత్యేకంగా ప్రదర్శించబడుతుందని మేకర్స్ వెల్లడించారు. అందుకు సంబంధించిన టీజర్ ను రిలీజ్ చేశారు. బాలీవుడ్ తారలు దీపికా పదుకొణె మరియు దిశా పటాని హీరోయిన్లుగా నటిస్తున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను వైజయంతీ మూవీస్ భారీ స్థాయిలో నిర్మిస్తోంది. కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, రాజేంద్ర ప్రసాద్, పశుపతి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన ఈ క్రేజీ కాంబినేషన్ పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు