‘కల్కి’ 6 వేల సంవత్సరాల ప్రయాణం

‘కల్కి’ 6 వేల సంవత్సరాల ప్రయాణం

Published on Feb 26, 2024 12:00 PM IST

నేషనల్ స్టార్ ప్రభాస్ హీరోగా – నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ‘కల్కి 2898 AD’ అనే ఫాంటసీ సైంటిఫిక్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఐతే, ఈ మూవీ గురించి నాగ్ అశ్విన్ ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు. ఓ ఇంటర్వ్యూలో నాగ్ మాట్లాడుతూ.. ‘మా సినిమా మహాభారతంలో మొదలై 2898ADలో ముగుస్తుంది. మొత్తం 6వేల సంవత్సరాల ప్రయాణాన్ని చూపిస్తాం. ఈ సినిమా కోసం భారీ సెట్స్, వాహనాలను డిజైన్ చేస్తున్నాం. మే 9న కల్కి రిలీజ్ అవుతుంది’ అని చెప్పుకొచ్చాడు.

అన్నట్టు రీసెంట్ గా ఈ మూవీ క్లైమాక్స్‌ కు ముందు వచ్చే సన్నివేశాల్లో పరశురాముడిగా జూనియర్ ఎన్టీఆర్, కృపాచార్యుడి పాత్రలో నాని కనిపిస్తారని టాక్ నడిచింది. ఈ రూమర్ పై కూడా ఇంకా క్లారిటీ లేదు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్‌ స్టార్ అమితాబ్ బచ్చన్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. మొత్తానికి పాన్ -ఇండియా చిత్రంగా ఈ సినిమాని మలచడానికి నాగ్ అశ్విన్ బాగా ప్రయత్నాలు చేస్తున్నాడు. వైజయంతీ మూవీస్‌ పతాకంపై అశ్వనీదత్‌ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు