“వార్ 2” లో క్రేజీ యాక్షన్ సీక్వెన్స్.. కియారాపై లేటెస్ట్ అప్డేట్స్

“వార్ 2” లో క్రేజీ యాక్షన్ సీక్వెన్స్.. కియారాపై లేటెస్ట్ అప్డేట్స్

Published on Apr 13, 2024 3:01 PM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Jr NTR) అలాగే బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ (Hrithik Roshan) లు హీరోలుగా దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “వార్ 2”. మరి ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ సెన్సేషనల్ మల్టీ స్టారర్ రీసెంట్ గానే స్టార్ట్ అయ్యింది. మరి ఎన్టీఆర్ కూడా ముంబైలో ల్యాండ్ అవ్వగా హృతిక్, ఎన్టీఆర్ ల మాస్ ఫ్రేమ్ కోసం ఇప్పుడు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే ఇప్పుడు ఈ సినిమా సంబంధించి క్రేజీ అప్డేట్స్ బాలీవుడ్ వర్గాలు నుంచి వినిపిస్తున్నాయి. వీటి ప్రకారం ఎన్టీఆర్, హృతిక్ లపై కొన్ని ఏరియల్ యాక్షన్ సీక్వెన్స్ లని తెరకెక్కించనున్నారట. అంటే పఠాన్, ఫైటర్ చిత్రాల తరహాలో గాలిలో క్రేజీ యాక్షన్ సీక్వెన్స్ లు ఇందులో ఉండబోతున్నాయి అని చెప్పాలి.

ఇక ఈ సినిమాలో స్టార్ నటి కియారా అద్వానీ కూడా ఉందన్న టాక్ ఉంది. మరి ఈమె ఈ మే 1 నుంచి షూటింగ్ లో జాయిన్ కానుంది అని రూమర్స్ వినిపిస్తున్నాయి. మొత్తానికి అయితే “వార్ 2” తో మేకర్స్ నెక్స్ట్ లెవెల్ ట్రీట్ ని ఇవ్వబోతున్నారు అని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు