క్రేజీ అప్ డేట్ కి రెడీ అయిన ధనుష్ – నాగ్ మూవీ

క్రేజీ అప్ డేట్ కి రెడీ అయిన ధనుష్ – నాగ్ మూవీ

Published on Jan 25, 2024 11:04 PM IST

కింగ్ అక్కినేని నాగార్జున, తమిళ స్టార్ నటుడు ధనుష్ తొలిసారిగా కలిసి నటిస్తున్న లేటెస్ట్ భారీ మల్టి స్టారర్ మూవీ ఇటీవల గ్రాండ్ గా ప్రారంభం అయిన విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం ఇది DNS వర్కింగ్ టైటిల్ తో రూపొందుతోంది.

శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, అమిగోస్ క్రియేషన్స్ సంస్థల పై భారీ స్థాయిలో నిర్మితం అవుతున్న ఈమూవీని శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్నారు.

అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ నుండి రేపు ఉదయం 10 గం. 8 ని. లకు ఒక క్రేజీ అప్ డేట్ రానున్నట్లు మేకర్స్ కొద్దిసేపటి క్రితం తమ సోషల్ మీడియా ప్రొఫైల్స్ ద్వారా తెలిపారు. కాగా ఈ క్రేజీ ప్రాజక్ట్ గురించిన మరిన్ని అప్ డేట్స్ ఒక్కొక్కటిగా త్వరలో రానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు