షూట్ కి ప్రిపేర్ అవుతున్న క్రియేటివ్ డైరెక్టర్ !
Published on Jan 11, 2019 2:28 pm IST

టాలీవుడ్ లో తనకంటూ ఓ క్రియేటివ్ డైరెక్టర్ గా పేరుప్రఖ్యాతలు తెచ్చుకున్న ‘కృష్ణ వంశీ’ గత కొన్ని సంవత్సరాలుగా ఆయన సినిమాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడుతున్నాయి. దాంతో ఈ సారి రీమేక్ ను నమ్ముకున్నాడు. ప్రముఖ నటుడు నానా పటేకర్ ప్రధాన పాత్రగా మరాఠీలో రూపొంది మంచి విజయం సాధించిన ‘నటసామ్రాట్’ చిత్రాన్ని కృష్ణవంశీ తెలుగులోకి రీమేక్ చెయ్యటానికి ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే.

కాగా నానా పటేకర్ పాత్రలో ప్రకాష్ రాజ్ ను తీసుకోవాలనే ఉద్దేశ్యంతో ఇటీవలే కృష్ణ వంశీ ప్రకాష్ రాజ్ కి కథ చెప్పడం, కథ వినగానే వెంటనే ప్రకాష్ రాజ్ ఈ సినిమా చెయ్యటానికి అంగీకరించడం వెంటనే జరిగిపోయాయి. ఇక కృష్ణ వంశీ ‘నటసామ్రాట్’ స్క్రిప్ట్ లో తెలుగుకు తగ్గట్లు మార్పులు చేర్పులు కూడా పూర్తి చేశారట. త్వరలోనే షూటింగ్ ను మొదలు పెట్టడానికి తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరి ఈ రీమేక్ తోనైనా ఈ క్రియేటివ్ డైరెక్టర్ మళ్ళీ ఫామ్ లోకి వస్తారేమో చూడాలి.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook