రేపటి నుండి ఓటిటి లోకి “క్రూ”

రేపటి నుండి ఓటిటి లోకి “క్రూ”

Published on May 23, 2024 6:03 PM IST

టబు (Tabu), కరీనా కపూర్ ఖాన్ (Kareena Kapoor Khan), కృతి సనన్ (Kriti Sanon) ప్రధాన పాత్రల్లో, డైరెక్టర్ రాజేష్ ఏ. కృష్ణన్ దర్శకత్వం లో తెరకెక్కిన కామెడీ థ్రిల్లర్ క్రూ (Crew). ఈ బాలీవుడ్ మూవీ మార్చి 29 వ తేదీన థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకు పోతుంది. ఇప్పటి వరకూ 150 కోట్ల రూపాయలకి పైగా వసూళ్లు రాబట్టింది.

ఈ చిత్రం డిజిటల్ ప్రీమియర్ కి రెడీ అయిపోయింది. మే 24 వ తేది నుండి, అనగా రేపటి నుండి ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ అయిన నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం కానుంది. మేకర్స్ దీనిపై అధికారిక ప్రకటన చేయడం జరిగింది. బాలాజీ మోషన్ పిక్చర్స్, అనిల్ కపూర్ ఫిల్మ్స్ అండ్ కమ్యూనికేషన్ నెట్వర్క్ బ్యానర్స్ పై నిర్మించిన ఈ చిత్రం లో దిల్జిత్ దోసంజ్, కపిల్ శర్మ లు కీలక పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు