డిజిటల్ ప్రీమియర్ కి సిద్ధమైన “క్రూ”

డిజిటల్ ప్రీమియర్ కి సిద్ధమైన “క్రూ”

Published on Apr 30, 2024 8:31 PM IST

టబు (Tabu), కరీనా కపూర్ ఖాన్ (Kareena Kapoor Khan), కృతి సనన్ (Kriti Sanon) ప్రధాన పాత్రల్లో, డైరెక్టర్ రాజేష్ ఏ. కృష్ణన్ దర్శకత్వం లో తెరకెక్కిన కామెడీ థ్రిల్లర్ క్రూ (Crew). ఈ బాలీవుడ్ మూవీ మార్చి 29 వ తేదీన థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకు పోతుంది. ఇప్పటి వరకూ 150 కోట్ల రూపాయలకి పైగా వసూళ్లు రాబట్టింది.

ఈ చిత్రం డిజిటల్ ప్రీమియర్ కి రెడీ అయిపోయింది. మే 24 వ తేది నుండి ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫారం అయిన నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం కానుంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది. బాలాజీ మోషన్ పిక్చర్స్, అనిల్ కపూర్ ఫిల్మ్స్ అండ్ కమ్యూనికేషన్ నెట్వర్క్ బ్యానర్స్ పై నిర్మించిన ఈ చిత్రం లో దిల్జిత్ దోసంజ్, కపిల్ శర్మ లు కీలక పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు