70 కోట్లతో దూసుకు పోతున్న “క్రూ” మూవీ!

70 కోట్లతో దూసుకు పోతున్న “క్రూ” మూవీ!

Published on Apr 2, 2024 5:33 PM IST

టబు (Tabu), కరీనా కపూర్ ఖాన్ (Kareena Kapoor Khan), కృతి సనన్ (Kriti Sanon) ప్రధాన పాత్రల్లో, డైరెక్టర్ రాజేష్ ఏ. కృష్ణన్ దర్శకత్వం లో తెరకెక్కిన కామెడీ థ్రిల్లర్ క్రూ (Crew). ఈ బాలీవుడ్ మూవీ మార్చి 29 వ తేదీన థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకు పోతుంది. వీక్ డేస్ లో కూడా స్ట్రాంగ్ హోల్డ్ ను కనబరుస్తోంది ఈ సినిమా.

ఈ చిత్రం ఇప్పటి వరకూ వరల్డ్ వైడ్ గా 70.73 కోట్ల రూపాయలకి పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టడం జరిగింది. బాలాజీ మోషన్ పిక్చర్స్, అనిల్ కపూర్ ఫిల్మ్స్ అండ్ కమ్యూనికేషన్ నెట్వర్క్ బ్యానర్స్ పై నిర్మించిన ఈ చిత్రం లో దిల్జిత్ దోసంజ్, కపిల్ శర్మ లు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం లాంగ్ రన్ లో మరింత వసూళ్లను రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు