అవికా గోర్ తో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న క్రికెటర్ రస్సెల్..

అవికా గోర్ తో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న క్రికెటర్ రస్సెల్..

Published on May 2, 2024 7:12 PM IST

ప్రస్తుతం ఇండియా వైడ్ గా ఐపీఎల్ ఫీవర్ నడుస్తున్న సంగతి తెలిసిందే. మరి ఐపీఎల్ లో మంచి ఫేమ్ ఉన్న పవర్ హిట్టర్స్ లో కరేబియన్ ప్లేయర్ ఆండ్రూ రస్సెల్ కూడా ఒకరు. గత కొన్నాళ్ల నుంచి కోల్ కతా నైట్ రైడర్స్ కి ఆడుతున్న తాను ఎన్నో మ్యాచ్ లని మలుపు తిప్పేసాడు. అయితే ఈ పవర్ హిట్టర్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. అది కూడా యంగ్ హీరోయిన్ అవికా గోర్ తో కలిసి ఇస్తున్నాడు.

మరిన్ని డీటెయిల్స్ లోకి వెళితే పలాస్ ముచ్చల్ మ్యూజిక్, డైరెక్షన్ లో ప్లాన్ చేసిన ఓ సాంగ్ “లడ్కి తూ కమాల్ కి” అనే ఫీచర్ సాంగ్ ని అయితే వారిద్దరి మీద షూట్ చేయగా దీనితో రస్సెల్ బాలీవుడ్ డెబ్యూ ఇవ్వబోతున్నాడు. ఇక ఈ సాంగ్ ఈ మే 9న రిలీజ్ కానున్నట్టుగా ఇద్దరిపై ఓ కలర్ ఫుల్ పోస్టర్ తో అప్డేట్ బయటకి వచ్చింది. ఈ సాంగ్ కి పవన్ – బాబ్ లు కొరియోగ్రాఫ్ చేయగా గిరీష్ జైన్, వినీత్ జైన్ లు నిర్మాణం వహించారు. మరి తన డెబ్యూ లో రస్సెల్ ఎలాంటి ట్రీట్ ఇస్తాడో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు