తమిళ దర్శకుడు జయేంద్ర దర్శకత్వ సారథ్యంలో నందమూరి కళ్యాణ్ రామ్, మిల్కీ బ్యూటీ తమన్నాలు జంటగా నటించిన చిత్రం ‘నా నువ్వే’. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా ఆడియో ఇటీవలే విడుదలై మంచి రన్ స్పందన దక్కించుకుంది. పూర్తిస్థాయి రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఉండబోతున్న ఈ చిత్ర రన్ టైమ్ గంట 58 నిమిషాలుగా ఉండనుంది.
ఇందులో ఫస్టాఫ్ గంట నిడివితో, సెకండాఫ్ 58 నిముషాల నిడివితో ఉంటుందట. ఒక లవ్ స్టోరీకి ఈ ఇలాంటి రన్ టైమ్ అనుకూలంగానే పనిచేస్తుందని చెప్పొచ్చు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్లో మహేష్ కోనేరు సమర్పణలో కూల్ బ్రీజ్ సినిమా బ్యానర్ పై విజయ్ వట్టికూటి, కిరణ్ ముప్పవరపులు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. షరత్ సంగీతం అందించిన ఈ చిత్రం మే 25న విడుదలకానుంది.
