‘రామాయణ’ పై విమర్శలు.. కారణాలు అవే !

‘రామాయణ’ పై విమర్శలు.. కారణాలు అవే !

Published on Aug 2, 2026 12:04 PM IST

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ రాముడిగా, హీరోయిన్ సాయి పల్లవి సీతగా బాలీవుడ్ దర్శకుడు నితేష్ తివారీ తీస్తున్న సినిమా ‘రామాయణ’. భారీ విజువల్ స్కేల్ ఉన్న సినిమా, పైగా భారతీయ సినిమాల్లోనే అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్న సినిమా, రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, యశ్ రావణుడిగా రాబోతున్న సినిమా. అన్నిటికీ మించి అంతర్జాతీయ స్థాయి టెక్నికల్ టీమ్ పనిచేస్తున్న సినిమా ఇది. ఇలాంటి సినిమా పై నెగిటివ్ కామెంట్స్ వినిపించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ముఖ్యంగా కొన్ని విఎఫ్ఎక్స్ షాట్లు అసంపూర్తిగా అనిపించడం, అలాగే మరికొన్ని షాట్లలో సిజిఐ (CGI), మరియు లైటింగ్ సహజంగా అనిపించలేదని విమర్శలు వస్తున్నాయి. ఎలాగూ భావోద్వేగాల కంటే విజువల్ గ్రాండియర్‌పై ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు అని ఎప్పటినుంచో వినిపిస్తోంది. దీనికితోడు కాస్ట్యూమ్స్‌ పై కూడా రచ్చ నడుస్తోంది. ముఖ్యంగా సీత, ఇతర మహిళా పాత్రల కాస్ట్యూమ్స్‌ పై సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా మొత్తానికి సినీప్రియులందరి దృష్టి కూడా ప్రస్తుతం ‘రామాయణ’ మీదే ఉంది.

కాగా బాలీవుడ్‌లో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమాలో సన్నీ డియోల్ హనుమంతుడిగా, రవి దూబే లక్ష్మణుడిగా నటిస్తున్నారు. మొత్తానికి ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.

తాజా వార్తలు