యంగ్ అండ్ ఎనర్జిటిక్ మంచు మనోజ్ హీరోగా నటిస్తున్న సినిమా ‘కరెంట్ తీగ’. షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమాని అక్టోబర్ 2న రిలీజ్ చేయనున్నట్లు ఇది వరకే తెలియజేశాం. అలాగే ఈ రోజు ఈ సినిమా ఆడియోని హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్లో చాలా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే ఆడియోలోని దేవసాసు పాటని రిలీజ్ చేసారు. ఆ పాటకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.
ఇటీవలే విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ యాక్షన్ టీజర్ కి అందరి నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.
మంచు విష్ణు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. మనోజ్ కెరీర్లో అన్ని సినిమాల ఆడియో ఆల్బమ్స్ అన్నీ హిట్ అయ్యాయి. వాటన్నిటికీ మించి ఈ సినిమా ఆడియో ఆల్బమ్ ఉంటుందని అన్నాడు.
మంచు మనోజ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి జి. నాగేశ్వరరెడ్డి డైరెక్టర్. వెన్నెల కిషోర్ కీలక పాత్రలో కనిపించనున్న ఈ మూవీలో హాట్ బ్యూటీ సన్నీ లియోన్ అతిధి పాత్రలో కనిపించనుంటే, శిల్పి శర్మ ఓ ఐటెం సాంగ్ లో కనిపిచనుంది. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘వర్తపడు వాలిబర్ సంఘం’ సినిమాకి రీమేక్ కరెంట్ తీగ. కానీ తెలుగు కథలో మన నేటివిటీకి తగ్గట్టు చాలా మార్పులు చేసారు.


