
ఊహించిన రీతిలోనే మంచు మనోజ్ నటించిన ‘కరెంట్ తీగ’ సినిమా మంచి ఓపెనింగ్స్ ని అందుకుంది. మల్టీప్లెక్స్ దాదాపు 80శాతం బుకింగ్స్ చేసుకుంది. సింగల్ స్క్రీన్ లు హౌస్ ఫుల్ అయ్యిపోయాయి. మొదటిరోజు వినిపిస్తున్న పాజిటీవ్ రివ్యూలతో వారాతరంలో మంచి రెస్పాన్స్ ని అందుకునే అవకాశం వుంది.
ఈ సినిమాకు విష్ణు మంచు నిర్మాత. రకుల్ ప్రీత్, సన్నీ లియోన్ ల గ్లామర్ సినిమా విజయానికి దోహదపడుతుంది. ఈ చిత్రానికి నాగేశ్వర రెడ్డి దర్శకుడు. అచ్చు సంగీతం అందించాడు. కరెంట్ తీగ చిత్రం తమిళంలో ఘనవిజయం సాధించిన ‘వర్తపాదాధ వలిబార్ సంఘం’ సినిమాకు రిమేక్.