జాతి రత్నాలు డబ్బింగ్ షురూ చేశారు..!

Published on May 29, 2020 7:12 pm IST

సీనియర్ నటుడు నరేష్ చిత్ర పరిశ్రమ కార్యకలాపాలు తిరిగి ప్రారంభం కావడంతో ఆయన ఆనందం వ్యక్తం చేశారు. అలాగే ప్రభుత్వ ఆదేశాలు, గైడ్ లైన్స్ పాటిస్తూ జాగ్రత్తగా ఉందాము అన్నారు. మనం కరోనా వైరస్ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకొని ప్రభుత్వాన్ని, చిత్ర పరిశ్రమను ముందుకు తీసుకెళదాం అన్నారు. నేడు ఆయన జాతి రత్నాలు మూవీ కోసం డబ్బింగ్ చెప్పారు.

ఇక స్వప్న సినిమా బ్యానర్ లో నాగ్ అశ్విన్ ఈ మూవీని నిర్మిస్తుండగా, దర్శకుడు అనుదీప్ కేవీ తెరకెక్కిస్తున్నారు. చాలా రోజుల క్రితం ఈ చిత్ర మోషన్ పోస్టర్ ని విడుదల చేశారు. నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి మరియు రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న ఈ చిత్రం కామెడీ థ్రిల్లర్ గా రానుంది.

సంబంధిత సమాచారం :

More