సెన్సార్ పనులు ముగించుకున్న ‘డెకాయిట్’.. రన్ టైం ఎంతంటే..?

dacoit-1

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటించిన మోస్ట్ అవేటెడ్ మూవీ ‘డెకాయిట్’. షనీల్ డియో దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ రివెంజ్ డ్రామా, ఏప్రిల్ 10, 2026న భారీ స్థాయిలో థియేటర్లలోకి రాబోతోంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, టీజర్ సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి.

​సెన్సార్ బోర్డు నుంచి ఈ చిత్రానికి U/A సర్టిఫికేట్ లభించింది. ఇక ఈ యాక్షన్ థ్రిల్లర్ నిడివిని మేకర్స్ 2 గంటల 32 నిమిషాలు గా ఖరారు చేశారు. ఉత్కంఠభరితమైన కథాంశంతో సాగే ఈ చిత్రం ప్రేక్షకులకు ఒక సరికొత్త సినిమాటిక్ అనుభూతిని ఇస్తుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా పాజిటివ్ ట్రెండ్‌ను చూపిస్తుండటం సినిమా క్రేజ్‌ను స్పష్టం చేస్తోంది.

​అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ ఈ చిత్రాన్ని నిర్మించగా, సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ సినిమాలో అనురాగ్ కశ్యప్, ప్రకాష్ రాజ్, సునీల్ మరియు జైన్ మేరీ ఖాన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Exit mobile version