ఇండియా టు యూఎస్.. ఓటీటీలో దూసుకుపోతున్న ‘డెకాయిట్’..!

ఇండియా టు యూఎస్.. ఓటీటీలో దూసుకుపోతున్న ‘డెకాయిట్’..!

Published on May 9, 2026 11:35 PM IST

dacoit-1

అడివి శేష్ హీరోగా నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ‘డెకాయిట్’ బాక్సాఫీస్ వద్దే కాకుండా, ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై కూడా రికార్డులు సృష్టిస్తోంది. మే 8న ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన ఈ చిత్రం, స్ట్రీమింగ్ ప్రారంభమైన కొన్ని గంటల్లోనే ఇండియా లెవల్‌లో నెంబర్ 1 స్థానానికి చేరుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఇక ఇప్పుడు ఈ చిత్రం యూఎస్‌లో కూడా నెంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతుండటం విశేషం. వైవిధ్యమైన కథలను ఎంచుకోవడంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అడివి శేష్, ఈ సినిమాతో మరోసారి ప్రేక్షకులను మెప్పించాడు. ప్రస్తుతం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉన్న ఈ చిత్రానికి సోషల్ మీడియాలో భారీ రెస్పాన్స్ లభిస్తోంది.

ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ నటన, అడివి శేష్‌తో ఆమె కెమిస్ట్రీ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. వీరితో పాటు అనురాగ్ కశ్యప్, ప్రకాష్ రాజ్, సునీల్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

తాజా వార్తలు