ముఖ్య అంశాలు
- భారత క్రికెట్ దిగ్గజం సౌరవ్ గంగూలీ బయోపిక్ ‘దాదా – ది సౌరవ్ గంగూలీ స్టోరీ’ ఫస్ట్ లుక్ విడుదలైంది.
- లార్డ్స్ బాల్కనీలో గంగూలీ జెర్సీ విదిల్చిన ఐకానిక్ సీన్‌ను రీక్రియేట్ చేస్తూ రాజ్‌కుమార్ రావు లుక్‌ను లాంచ్ చేశారు.
- విక్రమాదిత్య మోత్వానే దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం 2027 మే 14న థియేటర్లలో విడుదల కానుంది.
భారతీయులకి ఉన్న వినోద అంశాల్లో క్రికెట్ కూడా ఒకటి. ఇది ఒకింత వినోద అంశం అనే కంటే తమకి ఓ ప్రత్యేకమైన భావోద్వేగం అని కూడా చెప్పొచ్చు. మైదానంలో తాము ఆడనప్పటికీ అక్కడ ఆడే 11 మంది ఆట పట్ల ప్రాణం పెట్టి చూస్తారు. అలా భారతీయ క్రికెట్ జట్టులో తనకంటూ ఓ అరుదైన ముద్ర వేసుకున్న అతికొద్ది మంది స్టార్ క్రికెటర్స్ లో ‘దాదా’ గా పిలుచుకునే సౌరవ్ గంగూలీ కూడా ఒకరు.
భారత క్రికెట్ జట్టుకి సారధ్యం వహించడమే కాకుండా క్రికెటర్ గా కూడా ఎన్నో ఉన్నత శిఖరాలు తాను అధిరోహించారు. మరి అలాంటి తనపై తెరకెక్కుతున్న చిత్రమే ‘దాదా’. బాలీవుడ్ టాలెంటెడ్ నటుడు రాజ్ కుమార్ రావు 2002 లో జరిగిన ఇంగ్లాండ్ ఫైనల్ మ్యాచ్ లో గెలిచిన ఆనందాన్ని గంగూలీ తన జెర్సీ తీసేసి సెలబ్రేట్ చేయడం ఒక చారిత్రాత్మిక ఘట్టంగా క్రికెట్ హిస్టరీలో లిఖించబడింది.
మరి ఆ మూమెంట్ తోనే రాజ్ కుమార్ రావుపై డిజైన్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఇపుడు వైరల్ గా మారింది. నేడు గంగూలీ పుట్టినరోజు కానుకగా విడుదల చేసిన ఈ పోస్టర్ కి అనూహ్య రెస్పాన్స్ వస్తుంది.
భారీ కాంబినేషన్.. రిలీజ్ ఎప్పుడంటే?
మేకర్స్ ఈ చిత్రాన్ని తెలుగులో కూడా ఈ సినిమాని విడుదల చేస్తుండడం విశేషం. ‘దాదా – ది సౌరవ్ గంగూలీ స్టోరీ’.. అతను ఆట ఆడలేదు ఆటనే మార్చేశాడు అనే సాలిడ్ శీర్షిక పేరిట ఈ చిత్రాన్ని దర్శకుడు విక్రమ్ ఆదిత్య మొత్వానే తెరకెక్కించిన ఈ సినిమా వచ్చే ఏడాది మే 14న విడుదల చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. లవ్ రంజన్, అంకుర్ గార్గ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టీ సిరీస్ మరియు డిబిఎల్ సంస్థలు సమర్పణలో సినిమా విడుదల కానుంది.
మరి క్రికెట్ బయోపిక్ సినిమాల్లో ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ ని అందుకుంటుందో వేచి చూడాల్సిందే.


