
ఇప్పటివరకూ మాస్, క్లాస్, యాక్షన్ మరియు భక్తిరస చిత్రాలు చేసిన ‘కింగ్’ నాగార్జున తన కెరీర్లో మొదటిసారిగా చేసిన సోషియో ఫాంటసీ చిత్రం ‘డమరుకం’. ఈ సినిమాలో సుమారు 45 నిమిషాల పాటు గ్రాఫిక్స్ ఉంటుంది. ఆ 45 నిమిషాల గ్రాపిక్స్ సన్నివేశాలు సినిమాకే హైలైట్ అవుతాయని ఈ చిత్ర టీం అంటోంది.
ఈ సినిమాని ఈ నెల 19న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా నాగార్జున ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మీ సినిమా విడుదలకి ఒక రోజు ముందే ‘కెమెరామెన్ గంగతో’ రాంబాబు’ చిత్రం రానుంది, దీనివల్ల థియేటర్ల సమస్య మరియు కలెక్షన్లు తగ్గావా అని అడిగిన ప్రశ్నకు నాగ్ సమాధానమిస్తూ ‘ అలాంటి సమస్య ఏమీ ఉండదండీ, అలా అనుకుంటే ప్రతి సంక్రాంతికి పెద్ద హీరోల సినిమాలు మూడు, నాలుగు విడుదలవుతుంటాయి మరి అప్పుడెలా సరిపోతున్నాయి థియేటర్లు, అప్పుడే రాని సమస్య ఇప్పుడు ఎందుకొస్తుంది. ఇదికూడా దసరా సీజన్ కనుక ఎక్కవగానే సినిమాలు వస్తాయి. సినిమా బాగుంటే ప్రేక్షకులు ఎన్ని సినిమాలైనా చూస్తారు’ అని ఆయన అన్నారు. యోగా బ్యూటీ అనుష్క కథానాయికగా నటించిన ఈ చిత్రంలో ఛార్మి ఒక ఐటెం సాంగ్ లో కనిపించనున్నారు. శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాకి యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిచగా, ఆర్.ఆర్ మూవీ మేకర్స్ బానర్ వారు నిర్మించారు.
అప్పుడు లేని సమస్య ఇప్పుడు ఎందుకొస్తుంది
అప్పుడు లేని సమస్య ఇప్పుడు ఎందుకొస్తుంది
Published on Oct 10, 2012 2:34 PM IST
సంబంధిత సమాచారం
- రాజంపేటలో ‘డేవిడ్ రెడ్డి’ క్లైమాక్స్ !
- పీరియాడిక్ నేపథ్యంలో శర్వా కొత్త సినిమా ?
- ‘రామాయణ’ క్లైమాక్స్ పై క్రేజీ న్యూస్ !
- స్పెషల్ సాంగ్ కోసం మెగాస్టార్ స్టైలిష్ లుక్ !
- ‘గాడ్ ఆఫ్ వార్’ సరికొత్త వరల్డ్.. విఎఫ్ఎక్స్ పై ప్రత్యేక దృష్టి !
- ‘అఖిల్’ తదుపరి కథ పై కొత్త చర్చ !
- ‘జైలర్ 2’తో క్లాష్ నుంచి తప్పుకున్న ధనుష్.. కానీ హ్యాట్రిక్ హీరోతో రెడీ?
- ‘ఫౌజీ’ లేటెస్ట్ పోస్టర్ లో ఆ నటుడు.. మరో ఇంట్రెస్టింగ్ డీటెయిల్?
- వైరల్ వీడియో: కూతురి చేయి పట్టి కన్నీటి పర్యంతమైన బండ్ల గణేష్!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- క్రేజీ కలయిక పై నెటిజన్ల ఆసక్తి !
- ‘ఇరుముడి’ నుంచి అవైటెడ్ చార్ట్ బస్టర్ వచ్చేసింది.. రవితేజ మాస్ ఎనర్జీతో ట్రాన్స్
- బాక్సాఫీస్ దగ్గర సంజయ్ విశ్వనాథ్ బ్యాటింగ్.. 2 రోజుల్లో సెంచరీ!
- మిస్టీరియస్ క్రైమ్ థ్రిల్లర్ ‘ది రెడ్ బ్యాగ్’ రిలీజ్ డేట్ లాక్.. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ద్వారా!
- మహేష్, ప్రభాస్ ఫెయిల్.. బన్నీ అయినా చేస్తాడా..?
- ‘జైలర్ 2’తో క్లాష్ నుంచి తప్పుకున్న ధనుష్.. కానీ హ్యాట్రిక్ హీరోతో రెడీ?
- ‘లెనిన్’ సక్సెస్.. అఖిల్ సైలెంట్.. ఎందుకో..?
- ఓటిటి డేట్ ఫిక్స్ చేసుకున్న ‘చెన్నై లవ్ స్టోరీ’.. ఎప్పుడు, ఎందులో అంటే!

