ఎన్.టి.ఆర్ జయంతికి దాన వీర శూర కర్ణ

dana-veera-sura-karna
స్వర్గీయ నందమూరి తారక రామారావుగారి స్వీయదర్శకత్వంలో వచ్చిన ‘దాన వీర శూర కర్ణ’ సినిమా ఎటువంటి చరిత్ర సృష్టించిందో, ఎన్ని రికార్డులను తిరగారాసిందో అందరికీ తెలిసిన విషయమే. మరోసారి ఇటువంటి చిత్రాన్ని పునర్నిర్మించే అవకాశం బాలరాజు, చేలసాని వెంకటేశ్వరరావులకి దక్కింది. ఈసారి ఈ చిత్రాన్ని బాలలతో నిర్మించడం విశేషం.

పౌరాణిక వేషాలు పసితనంనుండే నందమూరి వంశానికి అబ్బుతాయని 18ఏళ్ళ క్రితమే జూనియర్ ఎన్.టి.ఆర్ ‘బాల రామాయణం’ చిత్రం ద్వారా రుజువుచేశాడు. ఇప్పుడు నందమూరి జానకిరామ్ తనయులు మాస్టర్ ఎన్.టి.ఆర్ మరియు మాస్టర్ సౌమిత్ర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. దర్శకుడు జె.వి.ఆర్ మాట్లాడుతూ “సినిమా చాలా చక్కగా వస్తుంది. మార్చ్ 28తో చిత్రీకరణ పూర్తవుతుంది. ఏప్రిల్ లో నిర్మాణాంతర కార్యక్రమాలు ముగించుకుని స్వర్గీయ ఎన్.టి.ఆర్ జయంతి సందర్భంగా మే 28న విడుదలచెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నాం” అని తెలిపారు.

Exit mobile version