తెలుగులో రజిని మేనియా తగ్గలేదని దర్బార్ కలెక్షన్స్ నిరూపిస్తున్నాయి. జనరేషన్స్ మరీనా ఎవర్ గ్రీన్ హీరో అనిపిస్తున్నాడు. నిన్న తెలుగుతో పాటు ప్రధాన భాషలలో విడుదలైన దర్బార్ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దీనితో తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలలో ఈ చిత్రం చెప్పుకోడదగ్గ వసూళ్లు సాధించింది. మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో 7.5 కోట్ల గ్రాస్ మరియు 4.5 కోట్ల షేర్ రాబట్టింది. తెలంగాణా వరకే ఈ చిత్రం 2.27 కోట్ల షేర్ వసూలు చేసినట్టు సమాచారం. ఇక ఇవాళ మరియు పండుగ దినాలలో వసూళ్లు మెరుగయ్యే అవకాశం కలదు. ఓవర్ సీస్ లో కూడా దర్బార్ రికార్డు కలెక్షన్స్ వైపుగా దూసుకెళుతుంది.
టాలెంటెడ్ డైరెక్టర్ మురుగదాస్ ఈ చిత్రాన్ని మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు. రజిని దర్బార్ చిత్రంలో పోలీస్ అధికారి పాత్ర చేశారు. నివేదా థామస్ రజిని కూతురిగా సినిమాకు కీలకమైన రోల్ చేయడం జరిగింది. నయనతార హీరోయిన్ గా నటించగా అనిరుధ్ సంగీతం అందించారు. లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రం నిర్మించడం జరిగింది. బాలీవుడ్ సీనియర్ హీరో సునీల్ శెట్టి దర్బార్ చిత్రంలో ప్రతినాయకుడి పాత్ర చేయడం విశేషం.


