దర్బార్ సెన్సార్ పూర్తయింది.. రన్ టైం ఎంతంటే.. !

దర్బార్ సెన్సార్ పూర్తయింది.. రన్ టైం ఎంతంటే.. !

Published on Jan 3, 2020 5:48 PM IST

DARBAR 1

రజిని కాంత్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ దర్బార్. దర్శకుడు మురుగదాస్ తెరకెక్కించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కానుంది. కాగా తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. ‘U/A ‘ సర్టిఫైతో భారీ స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రావ్వడానికి సన్నధం అవుతుంది. ఈ చిత్రం యొక్క రన్‌ టైమ్ 2 గంటల 39 నిమిషాల అని తెలుస్తోంది.

ముంబై మాఫియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రజిని కాంత్ చాలా కాలం తరువాత పోలీస్ అధికారి పాత్ర చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ యూట్యూబ్ లో రికార్డ్ వ్యూస్ దక్కించుకుంది. అనిరుధ్ సంగీతం అందిస్తుండగా ఇప్పటికే విడుదలైన రెండు సాంగ్స్ విశేష ఆదరణ దక్కించుకున్నాయి. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రజిని కాంత్ సరసన హీరోయిన్ గా లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తున్నారు.

నివేదా థామస్ కూడా ఓ రోల్ చేస్తున్నారు. రజిని – మురుగదాస్ కాంబినేషన్ నుండి వస్తున్న చిత్రం కావడంతో మూవీ పై భారీ అంచనాలున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు