విమానాల మీద ‘దర్బార్’ ప్రమోషన్లు

విమానాల మీద ‘దర్బార్’ ప్రమోషన్లు

Published on Jan 2, 2020 11:31 PM IST

darbAR

సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త చిత్రం ‘దర్బార్’ జనవరి 9న విడుదలకానుంది. మురుగదాస్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. అంచనాలకు తగ్గట్టే నిర్మాతలు కూడా సినిమాకు పెద్ద ఎత్తున ప్రమోషన్లు చేస్తున్నారు. ఏకంగా స్పైస్ జెట్ విమానాల మీద ‘దర్బార్’ రజనీ స్టిల్స్ వేసి ప్రమోట్ చేస్తున్నారు. గతంలో కూడా రజనీ చేసిన ‘కబాలి’ సినిమాకు ఎయిర్ ఏషియా విమానాల మీద ఇలాగే రజనీ స్టిల్స్ వేసి ప్రమోషన్స్ చేశారు.

ప్రస్తుతం ‘దర్బార్’ సినిమాకు నాలుగు స్పైస్ జెట్ విమానాలను ఉపయోగిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రమోషన్స్ కోసం నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ పెద్ద ఎత్తున ఖర్చు చేస్తోంది. ఇకపోతే ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుక రేపు సాయంత్రం శిల్పకళా వేదికలో జరుగనుంది. ఈ చిత్రానికి సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా అనిరుద్ రవిచంద్రన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇందులో నయనతార కథానాయిక కాగా మరొక నటి నివేత థామస్ ఒక కీలక పాత్రలో నటిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు