దసరా సిల్క్ బార్ సీన్ వైరల్

దసరా సిల్క్ బార్ సీన్ వైరల్

Published on Apr 17, 2023 8:00 AM IST

నేచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన సినిమా ‘దసరా’. శ్రీకాంత్ ఒదెల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కీర్తి సురేష్, ధీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రల్లో నటించారు. కాగా ఈ చిత్రం రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి సూపర్ హిట్‌గా నిలిచింది. అయితే, తాజాగా ఈ సినిమా నుంచి సిల్క్ బార్ సీన్ వీడియోను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. వీడియో విడుదల కాగానే నెట్టింట వైరల్ గా మారింది. ఇక వీడియో విషయానికి వస్తే.. తన ఫ్రెండ్‌ను కొందరు కొడుతుంటే, నాని ఆవేశంగా బార్‌లోకి ఎంటరయ్యే ఈ సీన్ వచ్చినప్పుడు విజిల్స్, అరుపులతో థియేటర్లు దద్దరిల్లిపోయాయి.

సినిమాలో చాలా కీలకమైన ఈ సీన్‌ను రిలీజ్ చేయడంతో ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీన్ అదిరిపోయింది అని, నాని నటన అద్భుతం అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఈ సినిమా 111 కోట్లకి పైగా గ్రాస్ ని రాబట్టింది. ఇక దసరా స్ట్రీమింగ్ హక్కులు నెట్ ఫ్లిక్స్ వారు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ మాస్ ప్రాజెక్ట్ కి సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా ఎస్ ఎల్ వి సినిమాస్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహించారు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు