
పూరి జగన్నాధ్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘టెంపర్’ సినిమా గత శుక్రవారం విడుదలైంది. ఈ సినిమా విజయంలో ఎన్టీఆర్ పెర్ఫార్మన్స్, క్యారేక్టరైజేషన్.. పూరి డైలాగ్స్, టేకింగ్ కీలక పాత్ర పోషించాయి. ముఖ్యంగా సినిమా పతాక సన్నివేశాలలో పూరి దర్శకత్వ ప్రతిభకు సర్వత్రా ప్రసంశలు లభిస్తున్నాయి.
నేడు సినిమా చూసిన దర్శకరత్న దాసరి నారాయణరావు గారు.. నా వారసుడివి నువ్వే అంటూ పూరి జగన్నాధ్ ను ప్రశంసించారు. ఈ విషయాన్ని పూరి సోషల్ మీడియాలో వెల్లడించారు. ‘నా జీవితంలో బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఇది. సినిమా విజయం కంటే చాలా పెద్దది’ అని పూరి పేర్కొన్నారు.
పరమేశ్వరా ఆర్ట్స్ పతాకంపై బ్లాక్ బస్టర్ నిర్మాత బండ్ల గణేష్ నిర్మించిన ఈ సినిమా, విడుదలైన అన్ని ఏరియాలలో రికార్డు కలెక్షన్స్ సాదిస్తుంది. ఈ సినిమా విజయంతో అభిమానులు, చిత్ర బృందం చాలా సంతోషంగా ఉన్నారు.