మొదటిసారి యుఎస్ లో విడుదలవుతున్న దాసరి మూవీ

మొదటిసారి యుఎస్ లో విడుదలవుతున్న దాసరి మూవీ

Published on Nov 13, 2014 3:28 PM IST

errabasuu
దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన ‘ఎర్రబస్సు’ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని చిల్డ్రన్స్ డే కానుకగా నవంబర్ 14న రిలీజ్ కావడానికి సిద్దమవుతోంది. మంచు విష్ణు హీరోగా, కేథరిన్ ట్రేస హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో దాసరి ఓ కీలక పాత్ర పోషించాడు. ఈ సినిమా విషయంలో దాసరి ఎన్నాడూ లేని ఓ రికార్డ్ ని నెలకొల్పుతున్నాడు.

ఇప్పటి వరకూ దాసరి దర్శకత్వంలో వచ్చిన ఒక్క సినిమా కూడా యుఎస్ లో రిలీజ్ కాలేదు. మొట్ట మొదటిసారిగా ఎర్రబస్సు సినిమా సుమారు 150 స్క్రీన్స్ లో రిలీజ్ అవుతోంది. మంచు విష్ణు తన డిస్ట్రిబ్యూషన్ సంస్థ ద్వారా ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నాడు. మంచు విష్ణుకి దాసరి తాతయ్యగా కనిపించనున్న ఈ సినిమాకి చక్రి మ్యూజిక్ అందించాడు. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘మంజపై’ సినిమాకి ఇది రీమేక్.

తాజా వార్తలు