భర్త మహాశయులకు విజ్ఞప్తి.. ట్రైలర్ వచ్చేది ఎప్పుడంటే..?

భర్త మహాశయులకు విజ్ఞప్తి.. ట్రైలర్ వచ్చేది ఎప్పుడంటే..?

Published on Jan 5, 2026 4:07 PM IST

Bhartha Mahasayulaku Wignyapthi

మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’(Bhartha Mahasayulaku Wignyapthi) అభిమానుల్లో ఇప్పటికే మంచి హైప్‌ను తెచ్చుకుంది. ఈ చిత్ర టీజర్‌లో రవితేజ చుట్టూ తిరిగే సరదా లవ్ ట్రైయాంగిల్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. రవితేజ భార్యగా డింపుల్ హయాతి, ప్రేయసిగా ఆషిక రంగనాథ్ కనిపిస్తూ నవ్వులు పూయించారు. భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతం సినిమాపై అంచనాలు పెంచగా, మూడో పాట ‘వామ్మో వాయ్యో’ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్‌ను జనవరి 7న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీనికి సంబంధించి ఓ కలర్‌ఫుల్ పోస్టర్‌తో ట్రైలర్ రిలీజ్ డేట్‌ను వెల్లడించారు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో, ఎస్ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రం పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ప్రేక్షకులను అలరించనుంది.

‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’(Bhartha Mahasayulaku Wignyapthi) భోగి పండుగ రోజు, జనవరి 13న థియేటర్లలో విడుదల కానుంది. క్లాసిక్ కామెడీ, రొమాన్స్, ఎంటర్టైన్మెంట్ కలయికతో రవితేజ తన స్ట్రాంగ్ జోన్‌లో తిరిగి వస్తుండటంతో, ఈ సంక్రాంతికి ఇది ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించనుందని సినీ సర్కిల్స్‌లో అంచనాలు ఏర్పడ్డాయి.

తాజా వార్తలు