యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో హీరోయిన్స్ ఆనంద్ దేవరకొండ అలాగే వైష్ణవి చైతన్య కలయికలో దర్శకుడు ఆదిత్య హాసన్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ యూత్ ఫుల్ రొమాంటిక్ డ్రామా ‘ఎపిక్’. తన ఓటిటి హిట్ సిరీస్ 90స్ బయోపిక్ కి కొనసాగింపుగా వస్తున్న ఈ సినిమా టీజర్, పాటలు ఆడియెన్స్ ని అలరించాయి.
ఒక మేకర్స్ ఫైనల్ గా రెండో సాంగ్ పై అప్డేట్ అందించారు. దీంతో ఎపిక్ చిత్రం నుంచి రెండో పాట ఈ మే 26 ఉదయం 11 గంటల 8 నిమిషాలకి రిలీజ్ చేస్తున్నట్టుగా రివీల్ చేశారు. ఇక దీనిపై విడుదల చేసిన పోస్టర్ లో లీడ్ జంట ఓ బీచ్ దగ్గర క్లోజ్ గా నడుస్తూ తమ కెమిస్ట్రీ కనబరుస్తున్నారు.
ప్రముఖ సంగీత దర్శకుడు హీశం అబ్దుల్ వాహాబ్ అందించిన సాంగ్ కి స్కోర్ కి ఆల్రెడీ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక రెండో సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ నిర్మాణం వహిస్తున్నారు. రిలీజ్ డేట్ పై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
Love always looks more beautiful in the little moments ❤️#EPIC ~ First Semester 2nd single #PriyaSakhi Lyrical Video out on May 26th at 11:08AM 🫶🏻#AnandDeverakonda #AdityaHasan @vamsi84 @Iamvaishnavi04 @HeshamAWMusic @SitharaEnts @Fortune4Cinemas #SrikaraStudios @adityamusic pic.twitter.com/pRgXCUwByg
— Sithara Entertainments (@SitharaEnts) May 24, 2026


