లేటెస్ట్: “పుష్ప 2” డ్యూయెట్ సాంగ్ కి డేట్, టైం వచ్చేసింది

లేటెస్ట్: “పుష్ప 2” డ్యూయెట్ సాంగ్ కి డేట్, టైం వచ్చేసింది

Published on May 23, 2024 11:18 AM IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా నేషనల్ క్రష్ రష్మికా మందన్నా (Rashmika Mandanna) హీరోయిన్ గా మన టాలీవుడ్ క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న అవైటెడ్ భారీ చిత్రం “పుష్ప 2 ది రూల్” కోసం అందరికీ తెలిసిందే. పాన్ ఇండియా ఆడియెన్స్ లో బాహుబలి, కేజీయఫ్ సీక్వెల్స్ తర్వాత మళ్ళీ ఆ రేంజ్ బజ్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా నుంచి మేకర్స్ ఒకో సాంగ్ ని రిలీజ్ చేస్తున్నారు.

అలా ఫస్ట్ సింగిల్ పుష్ప పుష్ప సాలిడ్ హిట్ కాగా ఇప్పుడు రెండో సాంగ్ అది కూడా డ్యూయెట్ పై క్లారిటీ ఇచ్చేసారు. మరి రష్మికపై ఓ చిన్న బైట్ వీడియోతో సూసేకి అంటూ సాగే సాంగ్ ఈ మే 29న ఉదయం 11 గంటల 7 నిమిషాలకి రిలీజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేసేసారు. మరి దీనితో దేవిశ్రీ ప్రసాద్ మళ్ళీ మ్యాజిక్ రిపీట్ చేస్తాడేమో వేచి చూడాలి. ఇక ఈ భారీ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తుండగా ఈ ఆగస్ట్ 15న సినిమా పాన్ ఇండియా భాషల్లో భారీ స్థాయిలో విడుదల కానుంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు