‘మన శంకర వరప్రసాద్ గారు’ ట్రైలర్ లాంచ్.. ఎక్కడ, ఎప్పుడంటే..?

Mana-Shankara-Vara-Prasad-G (1)

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తుండటంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్‌కు ప్రేక్షకుల నుంచి క్రేజీ రెస్పాన్స్ దక్కుతోంది.

ఇక ఇప్పుడు ఈ సినిమా నుంచి ట్రైలర్ లాంచ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ లాంచ్‌ను జనవరి 4న తిరుపతిలో నిర్వహించేందుకు మేకర్స్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో అనౌన్స్ చేయనున్నారు.

కాగా ఈ సినిమాలో స్టార్ బ్యూటీ నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా విక్టరీ వెంకటేష్ క్యామియో రోల్‌లో నటిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సాహు గారపాటి, సుష్మిత కొణిదెల ప్రొడ్యూస్ చేస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కానుంది.

Exit mobile version