2025లో భారీ అంచనాల మధ్య విడుదలైన తెలుగు హారర్ చిత్రం ‘ఈషా’, బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. అదిత్ అరుణ్, హెబ్బా పటేల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా, ప్రమోషన్స్ పరంగా సందడి చేసినప్పటికీ కంటెంట్ విషయంలో యావరేజ్ టాక్‌ను మూటగట్టుకుంది.
ప్రస్తుతం ఈ చిత్రం థియేట్రికల్ విడుదలైన రెండు నెలల తర్వాత ఓటీటీలోకి అడుగుపెట్టింది. ప్రముఖ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ప్రస్తుతం ఈ సినిమా కేవలం ఓవర్సీస్లో మాత్రమే అందుబాటులో ఉంది. అది కూడా రెంటల్ పద్ధతిలో ఉండటం గమనార్హం.
ఇక ఇండియన్ ఆడియన్స్ ఈ సినిమాను చూసేందుకు మరికొంత కాలం వేచి చూడాల్సిందే. శ్రీనివాస్ మన్నె దర్శకత్వంలో కె.ఎల్.దామోదర్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి ఆర్.ఆర్.ధ్రువన్ సంగీతం అందించాడు. ఓటీటీ ఆడియన్స్ ఈ హారర్ థ్రిల్లర్‌ను ఏ మేరకు ఆదరిస్తారో వేచి చూడాలి.
సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చేయండి
