‘సైరా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్స్ కన్ఫర్మ్

Published on Sep 10, 2019 2:40 pm IST

‘సైరా’ కోసం మెగా టీమ్ భారీ ప్రమోషన్లను ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించడానికి సిద్దమవుతున్నారు. ఈ వేడుకను కర్నూల్ ప్రాంతంలో నిర్వహించాలని చిరు, రామ్ చరణ్ భావిస్తున్నట్టు గతంలోనే వార్తలొచ్చాయి. తాజా సమాచారం మేరకు ఈ సెప్టెంబర్ 18న ఈ వేడుకను జరపాలని మెగా కాంపౌండ్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

అయితే ఈ వార్తపై ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ అందాల్సి ఉంది. అలాగే వేడుకకు ముఖ్య అతిధిగా పవన్ కళ్యాణ్ రానున్నారనే వార్తలపై కూడా క్లారిఫికేషన్ రావాల్సి ఉంది. సుమారు రూ.270 కోట్ల వ్యయంతో నిర్మితమవుతున్న ఈ చిత్రాన్ని మొత్తం ఐదు భాషల్లో విడుదల చేయనున్నారు. సినిమాకున్న క్రేజ్ మూలాన ప్రీ రిలీజ్ బిజినెస్ సైతం భారీ ఎత్తున జరుగుతోంది. అమితాబ్, నయనతార, విజయ్ సేతుపతి, సుదీప్, జగపతిబాబు, తమన్నాలు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత సమాచారం :

X
More