బెంగుళూరులో సైరా వేడుకకు తేదీ ఖరారు…!

బెంగుళూరులో సైరా వేడుకకు తేదీ ఖరారు…!

Published on Sep 25, 2019 7:44 PM IST

syeraa

సైరా విడుదల నేపథ్యంలో చిత్ర యూనిట్ భారీ ప్రమోషన్స్ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్ వేదికగా లక్షల మంచి అభిమానుల సందోహంతో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించిన చిత్ర బృందం చెన్నై, బెంగుళూరు మరియు ఇతర నగరాలలో ప్రమోషనల్ ఈవెంట్స్ జరుప ఉద్దేశించారు. కాగా బెంగుళూరు లో నిర్వహించనున్న ఈ వేడుకకు తేదీ ఖరారైనట్లు తెలుస్తుంది. ఈనెల 29న అక్కడ గ్రాండ్ గా సైరా ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించాలని ప్రణాళికలు వేస్తున్నారట.

ఇక ఈ వేడుకకు కన్నడ చిత్ర ప్రముఖులతో పాటు, సైరా లో ఓ కీలకపాత్ర చేస్తున్న కిచ్చా సుదీప్ సందడి చేయనున్నారని సమాచారం. సౌత్లో తెలుగు చిత్రాలకు అతిపెద్ద మార్కెట్ గా కర్ణాటక ఉంది. సైరా హక్కులను కూడా అక్కడ ఓ బడా డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీ ఫ్యాన్సీ ధర చెల్లించి దక్కించుకోవడం జరిగింది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం కలదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు