లేటెస్ట్ : అన్ స్టాప్పబుల్.. “యానిమల్” ఎపిసోడ్ కి డేట్ ఫిక్స్.!

లేటెస్ట్ : అన్ స్టాప్పబుల్.. “యానిమల్” ఎపిసోడ్ కి డేట్ ఫిక్స్.!

Published on Nov 16, 2023 1:01 PM IST

నందమూరి నటసింహంగా నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “భగవంత్ కేసరి” తో తన కెరీర్ లో మరో మంచి హిట్ ని తాను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రం సక్సెస్ అనంతరం తన ఓటిటి సెన్సేషనల్ హిట్ షో “అన్ స్టాప్పబుల్” సీజన్ 3 ని కూడా స్టార్ట్ చేశారు.

అయితే ఈ సీజన్లో మోస్ట్ అవైటెడ్ గా ఉన్న క్రేజీ ఎపిసోడ్ ఏదన్నా ఉంది అంటే బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్ మరియు హీరోయిన్ రష్మికా మందన్నా దర్శకుడు సందీప్ రెడ్డి వంగ లు హాజరు అవుతున్న ఎపిసోడ్ అని చెప్పాలి. తాము చేసిన “యానిమల్” ప్రమోషన్స్ లో భాగంగా తాము బాలయ్య షోకి రావడానికి సిద్ధం అయ్యారు.

మరి ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న క్రేజీ ఎపిసోడ్ పై రిలీజ్ డేట్ ని స్ట్రీమింగ్ యాప్ ఆహా వారు రివీల్ చేసేసారు. మరి ఈ అవైటెడ్ ఎపిసోడ్ ని అయితే ఈ నవంబర్ 24న స్ట్రీమింగ్ కి తీసుకొస్తున్నట్టుగా ఓ ప్రోమో కట్ తో కన్ఫర్మ్ చేశారు. మరి ఈ సాలిడ్ ఎపిసోడ్ ఎలాంటి ఎంటర్టైన్మెంట్ అందిస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు