శర్వానంద్ “మనమే” వెడ్డింగ్ సాంగ్ రిలీజ్ కి డేట్ ఫిక్స్

శర్వానంద్ “మనమే” వెడ్డింగ్ సాంగ్ రిలీజ్ కి డేట్ ఫిక్స్

Published on May 28, 2024 11:01 AM IST

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కిస్తున్న ఇంట్రెస్టింగ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం “మనమే”. మరి ఇప్పుడు వరకు వచ్చిన పాటలు టీజర్ డీసెంట్ బజ్ ని అందుకోగా ఇప్పుడు మేకర్స్ సినిమా నుంచి మూడో సాంగ్ ని రిలీజ్ చేసే అనౌన్సమెంట్ చేసారు. మరి ఈ సాంగ్ ని ఒక వెడ్డింగ్ సెలెబ్రేషన్ సాంగ్ గా వస్తున్నట్టుగా తెలిపారు.

శర్వానంద్ అలాగే కృతి పై మంచి డాన్స్ చేస్తున్నట్టుగా కనిపిస్తున్నారు. మంచి కలర్ ఫుల్ గా ఉండేలా అనిపిస్తున్న ఈ సాంగ్ ని ఈ మే 30న రిలీజ్ చేస్తున్నట్టుగా తెలిపారు. ఇక ఈ చిత్రానికి టాలెంటెడ్ సంగీత దర్శకుడు హీషం అబ్దుల్ వహద్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహిస్తుండగా ఈ జూన్ 7న సినిమా థియేటర్లు లో రిలీజ్ కి రాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు