విడుదలకు సిద్దమైన ‘మెహబూబా’ ట్రైలర్ !

7th, April 2018 - 09:07:04 AM


దర్శకుడు పూరి జగన్నాథ్ తన కుమారుడ ఆకాష్ పూరి హీరోగా రూపొందిస్తున్న చిత్రం ‘మెహబూబా’. టీజర్ తో అందరి దృష్టినీ తన వైపుకు తిప్పికున్న ఈ చిత్రం యొక్క ట్రైలర్ ఈ ఏప్రిల్ నెల 9వ తేదీన రిలీజ్ కానుంది. 1971 ఇండియా, పాకిస్థాన్ యుద్ధ నైపథ్యంలో నడిచే ప్రేమ కథగా ఉండనున్న ఈ సినిమాలో నూతన నటి నేహా శెట్టి కథానాయకిగా నటిస్తోంది.

పూరి జగన్నాథ్ తన సొంత బ్యానర్ పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ పై నిర్మించిన ఈ చిత్రాన్ని నిర్మాత దిల్ రాజు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. మే 11న విడుదలకానున్న ఈ చిత్రానికి సందీప్ చౌత స్వరాలు సమకూర్చారు. ఈ చిత్రంతో తన కుమారుడ్ని పూర్తి స్థాయి హీరోగా నిలబెట్టాలని చూస్తున్నారు పూరి.